రాజమండ్రిలో విషాదం: బాణసంచా పేలి ఒకరు మృతి

Published : Oct 24, 2022, 02:24 PM ISTUpdated : Oct 24, 2022, 02:47 PM IST
రాజమండ్రిలో విషాదం: బాణసంచా పేలి  ఒకరు  మృతి

సారాంశం

రాజమండ్రి నగరంలో ఓ ఇంట్లో బాణసంచా పేలి ఒకరు  మరణించారు. బాణసంచా  తయారు  చేస్తున్న సమయంలో  ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.

రాజమండ్రి: నగరంలో  ఓ ఇంట్లో బాణసంచా  పేలి  ఒకరు మృతి చెందారు. బాణసంచా  తయారు చేస్తున్న  సమయంలో  సో మవారంనాడు పేలుడు  చోటు  చేసుకుంది. పేలుడు ధాటికి  ఇల్లు ధ్వంసమైంది. దీపావళిని  పురస్కరించుకొని బాణసంచా తయారు  చేస్తున్న  సమయంలో   ఈ  ప్రమాదం జరిగింది.

రాజమండ్రిలోని రైతు నగర్ లో  నిబంధనలకు  విరుద్దంగా  బాణసంచా తయారు చేస్తున్నారు. అయితే  ఈ బాణసంచా తయారు  చేస్తున్న సమయంో  ప్రమాదవశాత్తు  బాణసంచా పేలి  ఒకరు  మృతి చెందారు. బాణసంచా  తయారు  చేసే సమయంలో సరైన జాగ్రత్తలు  తీసుకోకపోవడం వల్ల  ప్రమాదాలు  జరిగిన సమయంలో  ప్రాణ, ఆస్తి  నష్టం  జరుగుతుందనే  అభిప్రాయాలు  కూడ  లేకపోలేదు.

నిన్న  విజయవాడలోని  జింఖానా గ్రౌండ్స్ లో  బాణసంచా దుకాణంలో  జరిగిన అగ్ని  ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు.దీపావళి  సందర్భంగా  జింఖానా  గ్రౌండ్స్ లో బాణ సంచా దుకాణాలను  ఏర్పాటు చేశారు. బాణసంచాను  స్టాల్స్ లోకి  తరలిస్తున్న  సమయంలో  ప్రమాదవశాత్తు మంటలు  వ్యాపించాయి. ఈ ప్రమాదంలో  బాణసంచా  దుకాణంలో  పనిచేసే  ఇద్దరు సజీవ దహనమయ్యారు.

గతంలో  కూడా  రెండు  తెలుగు రాష్ట్రాల్లో  బాణసంచా  తయారు చేస్తున్న  సమయంలో  ప్రమాదాలు జరిగిన ఘటనలు  చోటు చేసుకున్నాయి. ప్రమాదాలు  జరిగిన  సమయంలోనే  హడావుడి  చేసి  ఆ తర్వాత చూసీ చూడనట్టుగా  వ్యవహరించడం వల్లే   తరుచుగా  ఈ రకమైన ప్రమాదాలు చోటు  చేసుకుంటున్నాయనే  విమర్శలు కూడా  లేకపోలేదు. 

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని సబ్బవరం  మండలం ఆరిపాకలోని ఓ ఇంట్లో బాణాసంచా పేలి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటన  ఈ  ఏడాది సెప్టెంబర్  6న  చోటు చేసుకుంది. . ఎలాంటి అనుమతి లేకుండానే రహస్యంగా ఈ ప్రాంతంలో బాణసంచా తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.  ఈ ఘటనలో గాయపడిన నలుగురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాణసంచా తయారు చేయిస్తున్నవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఏడాది ఫిబ్రవరి 4న తూర్పుగోదావరి జిల్లా  మండపేటలో జరిగిన పేలుడులో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఏడాది ఫిబ్రవరి 4న తూర్పుగోదావరి జిల్లా  మండపేటలో జరిగిన పేలుడులో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

రెండు తెలుగు  రాష్ట్రాలతో పాటు దేశంలోని  ఇతర రాష్ట్రాల్లో బాణసంచా తయారీ  కేంద్రాల్లో  కూడ  ప్రమాదాలు  జరిగి  పలువురు మృతి చెందిన  ఘటనలు నమోదయ్యాయని పోలీసు  రికార్డులు  చెబుతున్నాయి.తమిళనాడు  రాష్ట్రంలోని విరుధ్  నగర్ లో  శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు  చోటు చేసుకుంది. ఈ  ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ  ప్రమాదంఈ  ఏడాది  జనవరి 1న జరిగింది.


 


 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!