వైఎస్సార్ జిల్లాలో డిగ్రీ విద్యార్థిని మృతి.. ఆత్మహత్యే అన్న పోలీసులు.. ప్రియుడిపై కేసు.. అసలేం జరిగిందంటే..

By Sumanth Kanukula  |  First Published Oct 24, 2022, 4:35 PM IST

వైఎస్సార్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన అనూష అనుమానస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు అనూషది ఆత్మహత్యగా తేల్చారు. 


వైఎస్సార్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన అనూష అనుమానస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు అనూషది ఆత్మహత్యగా తేల్చారు. ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో అనూష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అనూష ప్రియుడు మహేశ్వర్ రెడ్డి 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు. 

అసలేం జరిగిందంటే.. వైఎస్సార్ జిల్లాలోని మరాటిపల్లెకు చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవి దంపతుల రెండో కుమార్తె అనూష బద్వేలులోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. అయితే ఈ నెల 20వ తేదీన కాలేజ్‌కు వెళ్లిన అనూష తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అనూష తల్లిదండ్రులు పలుచోట్ల గాలింపు చేపట్టారు. అయితే అనూష ఆచూకీ లభించకపోవడంతో.. అదే రోజు రాత్రి బి కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  పోలీసులు విచారణ చేపట్టారు. 

Latest Videos

అయితే ఆదివారం సిద్ధవటం సమీపంలోని  జంగాలపల్లె పెన్నా నది తీర ప్రాంతంలో అనూష మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. అనూష మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనూష తల్లిదండ్రులు బిడ్డను అలా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక, మృతదేహానికి అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించి.. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 

click me!