ఏపీ పంచాయతీరాజ్‌శాఖలో 3,543 పనుల నిలిపివేత

Siva Kodati |  
Published : Sep 17, 2019, 02:53 PM IST
ఏపీ పంచాయతీరాజ్‌శాఖలో 3,543 పనుల నిలిపివేత

సారాంశం

ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా పలు పనులను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే బందరు పోర్ట్ పనులను సైతం జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా ఏపీ పంచాయతీరాజ్ శాఖలోనూ భారీగా పనులు నిలిపివేసింది. 

పంచాయతీ రాజ్ శాఖలో భారీ మొత్తంలో పనులను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,543 పనులను నిలిపివేస్తున్న ఆదేశాలు జారీ అవ్వగా.. వీటి విలువ రూ. 1031.17 కోట్లు.

పంచాయతీ రాజ్, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద అనుమతి పొందిన పనులను నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ ఒకటికి మందు అనుమతి పొందినప్పటికీ పనులు ఇంకా ప్రారంభించలేదనే కారణంతో వాటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా పలు పనులను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే బందరు పోర్ట్ పనులను సైతం జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. 

జగన్ నిర్ణయం... పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్

బందరు పోర్ట్ బంద్... నవయుగకు మరోషాక్, ఒప్పందాన్ని రద్దు చేసిన జగన్ సర్కార్

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం