ఆంధ్రప్రదేశ్ కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం రికార్డు స్థాయిలో 294 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,152కి చేరింది
ఆంధ్రప్రదేశ్ కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం రికార్డు స్థాయిలో 294 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,152కి చేరింది.
కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 84కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,034 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా... 2,723 మంది డిశ్చార్జ్ అయ్యారు.
undefined
Also Read:చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కు కరోనా
గడిచిన 24 గంటల్లో 15,633 మంది నమూనాలు పరీక్షించగా 294 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 39 మంది ఉన్నారు.
కాగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకింది.
హైదరాబాదులోని చంద్రబాబు నివాసం అతను ఇటీవల విధులు నిర్వహించాడు. హైదరాబాదులోని చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించి గుంటూరు జిల్లా బాపట్లకు వచ్చాడు.
అతను బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్ లో పనిచేస్తు్ననాడు. మే 5వ తేదీన డ్యూటీపై అతను హైదరాబాదు వెళ్లి ఈ నెల 7వ తేదీన వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు.
శనివారం వచ్చిన ఫలితాల్లో అతనికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాదులోని తోటి కానిస్టేబుల్ నుంచి అతనికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.