బెజవాడలో గ్యాంగ్‌వార్‌: రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం, కదలికలపై నిఘా

By Siva KodatiFirst Published Jun 14, 2020, 2:14 PM IST
Highlights

బెజవాడలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సందీప్- పండుల మధ్య గ్యాంగ్‌వార్ నేపథ్యంలో నగరంలోని రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు

బెజవాడలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సందీప్- పండుల మధ్య గ్యాంగ్‌వార్ నేపథ్యంలో నగరంలోని రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు.

విజయవాడ పోలీస్ కమీషనరేట్ పరిధిలో 470 మంది రౌడీషీటర్లను గుర్తించిన పోలీసులు.. ప్రతివారం కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరోవైపు గ్యాంగ్‌వార్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read:విజయవాడ గ్యాంగ్‌వార్: పనిచేయని పండూ చేతివేలు, న్యూరో జర్జరీ విభాగంలో పరీక్షలు

నిందితుల కోసం ఆరు పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు నిర్వహిస్తున్నాయి. గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న మరో 15 మంది నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కాగా గ్యాంగ్‌వార్‌లో గాయపడిన పండుకు మంగళవారం నాడు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇరువర్గాల దాడిలో సందీప్ వర్గీయుల దాడిలో గాయపడడంతో చేతి వేలు పనిచేయడం లేదని చెప్పడంతో వైద్యులు పరీక్షించారు.

విజయవాడ గ్యాంగ్‌వార్‌: పండు తల్లిపై కూడ కేసు

గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో పండుకు చికిత్స అందిస్తున్నారు. గత నెల 30వ తేదీన విజయవాడ తోటవారి సందులో సందీప్, పండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.

ఈ ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ గత నెల 31వ తేదీన మరణించాడు. ఘర్షణ జరిగిన రోజు నుండి పండు గుంటూరు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఇవాలో రేపో పండును ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగింది.

click me!