లాక్‌డౌన్ ఎఫెక్ట్: పెళ్లి ఆగిపోయిందనే మనోవేదనతో యువతి ఆత్మహత్య

By narsimha lode  |  First Published Apr 19, 2020, 2:05 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో తల్లి నారాయణమ్మతో కలిసి హేమావతి నివాసం ఉంటుంది. ఈ నెల 25వ తేదీన హేమావతి పెళ్లి జరగాల్సి ఉంది. హేమావతి తండ్రి అనారోగ్యంతో ఇదివరకే చనిపోయాడు. 
 


ధర్మవరం:కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో  హేమావతి అనే యువతి శనివారం నాడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో తల్లి నారాయణమ్మతో కలిసి హేమావతి నివాసం ఉంటుంది. ఈ నెల 25వ తేదీన హేమావతి పెళ్లి జరగాల్సి ఉంది. హేమావతి తండ్రి అనారోగ్యంతో ఇదివరకే చనిపోయాడు. 

Latest Videos

undefined

తల్లి నారాయణమ్మతో పాటు హేమావతి మగ్గం నేస్తూ  జీవనం సాగిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేవు. పెళ్లి కోసం నారాయణమ్మ పలువురి వద్ద అప్పు అడిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేకపోవడంతో అప్పులు ఇవ్వడానికి ఎవరూ కూడ రాలేదు.దీంతో పెళ్లి వాయిదా పడింది.

పెళ్లి వాయిదా పడిందని మనోవేదనకు గురైన హేమావతి శనివారం నాడు మగ్గాల షెడ్డులో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషయాన్ని చూసిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించేలోపుగా చనిపోయిందని వైద్యులు ప్రకటించారు.

also read:ఏపీలో విజృంభిస్తున్న కరోనా: 24 గంటల్లో 44 కొత్త కేసులు, మొత్తం 647కి చేరిక

హేమావతి మృతి చెందడంతో తల్లి నారాయణమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.లాక్ డౌన్ తో వలసకూలీలతో పాటు  పలు రంగాలకు చెందిన కార్మికులు ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే.

ఏపీ రాష్ట్రంలో ఆదివారం నాటికి 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంది.

click me!