చిత్తూరు: అటవీ ఆముదం గింజలు తిని... 25 మంది చిన్నారులకు అస్వస్థత

By Siva Kodati  |  First Published Aug 19, 2021, 8:39 PM IST

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబార్లపల్లెలో అడవి ఆముదం గింజలు తిని 25 మంది పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పలువురి పరిస్ధితి విషమంగా వున్నట్లు సమాచారం. 
 


చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వి.కోట మండలం కుంబార్లపల్లెలో అడవి ఆముదం గింజలు తిని 25 మంది పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం పాఠశాల అనంతరం ఆటలాడుకుంటూ వస్తున్న చిన్నారులు.. గ్రామ సమీపంలోని అడవి ఆముదం గింజలను తిన్నారు. ఆ వెంటనే వాంతులు.. విరేచనాలతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు వారిని వి.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్ధితి విషమంగా వున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
 

click me!