మా వెంట్రుక కూడా పీకలేరు.. చంద్రబాబుపై అనిల్ కుమార్ యాదవ్ ఫైర్.. (వీడియో)

By AN TeluguFirst Published Oct 23, 2021, 1:58 PM IST
Highlights

ముఖ్యమంత్రిని ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు, కారం తిన్న వారు ఎవరు చూస్తూ ఉండరు. గుంటూరు జిల్లా లో ఉప్పు, కారం ఎక్కువగా తింటారు. కాబట్టి పౌరుషం, రోషం ఎక్కువగా ఉంటాయి అని Anil Kumar Yadav అన్నారు.

నెల్లూరు జిల్లా : దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రం లో ఉండటం దౌర్భాగ్యం అంటూ మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ,ఆయన సుపుత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అనరాని మాటలు అన్నారు.

"

ముఖ్యమంత్రిని ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు, కారం తిన్న వారు ఎవరు చూస్తూ ఉండరు. గుంటూరు జిల్లా లో ఉప్పు, కారం ఎక్కువగా తింటారు. కాబట్టి పౌరుషం, రోషం ఎక్కువగా ఉంటాయి అని Anil Kumar Yadav అన్నారు.

ఒక పక్క గిచ్చడం మరోపక్క మాపై దాడి చేశారు అని దొంగ దీక్షలు చేయడం.. అబ్బా ,కొడుకులు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఏమీ పీకలేరు అన్నారు.

సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం Drugs తో ఎపికి ఎటువంటి సంబందం లేదని స్పష్టం చేసింది. డ్రగ్స్ ను ఎవరు ప్రోత్సహిస్తూన్నారో చూస్తే మీ మూలాలు కనిపిస్తాయి. డ్రగ్స్ తీసుకునే అలవాటు మీకు ఉంటే దాన్ని YCPపై రుద్దడం దారుణం.

ఏ రోజు అయిన ప్రజా సమస్యలపై పోరాటం చేసారా? కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప అని విరుచుకుపడ్డారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాపై దాడులు జరిగినా ఇక్కడే ఉన్నాం మీలా హైదరాబాద్ లో దాక్కోలేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టచ్ కూడా చేయలేరు. ABN రాధాకృష్ణ కుల పిచ్చి తో కొట్టుకుంటున్నాడు.  పిచ్చి రాతలు ఎని రాసిన మా వెంట్రుక కూడా పీకలేడు.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 

కాగా, ఏపీ సీఎం Ys  Jagan పై బూతు వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి Pattabhiని శుక్రవారం నాడు rajahmundry Cnetral  జైలుకు తరలించారు పోలీసులు.ఈ నెల 21న పట్టాభిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.దీంతో నవంబర్ 2వ తేదీ వరకు పట్టాభికి Remand విధించింది కోర్టు. 

గురువారం సాయంత్రం ఆయనను మచిలీపట్టణం  సబ్ జైలుకు పంపారు. రాత్రిపూట ఆయన అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య పట్టాభిని  మచిలీపట్టణం సబ్ జైలు నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

మొగతనం ఉంటే లోకేష్ ను పోటీ చేయమనండి: పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్

ఏపీ సీఎం జగన్ పై బూతు వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం ఆయనను కోర్టులో హాజరుపర్చారు.  కోర్టుకు సమర్పించిన పట్టాభి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే పట్టాభిని కస్టడీలోకి తీసుకోవాలని విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరో వైపు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ చేసింది కోర్టు.

జగన్ పై Tdpనేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఏపీలో Ycp శ్రేణులు ఇవాళ కూడా జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని టీడీపీ చీఫ్ చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడులను నిరసిస్తూ చంద్రబాబు టీడీపీ కార్యాలయంలోనే 36 గంటల దీక్ష చేశారు. 

click me!