విద్యార్ధినులపై లైంగిక వేధింపులు: ఇద్దరు టీచర్ల అరెస్ట్

Published : Aug 15, 2019, 03:21 PM IST
విద్యార్ధినులపై లైంగిక వేధింపులు: ఇద్దరు టీచర్ల  అరెస్ట్

సారాంశం

విశాఖ పట్టణంలో దారుణం చోటు చేసుకొంది. విద్యార్ధినులపై తరగతి గదిలోనే ఇద్దరు టీచర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం బయటకు  పొక్కడంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

విశాఖపట్టణం:వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు ఇద్దరు టీచర్లు.కంటికి రెప్పలా కాపాడుతూ విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వివ్యార్ధినులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.

భీమిలి మండలంలోని పెద్దిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో 42 మంది విద్యార్ధులు చదువుతున్నారు. హార్విన్ట్ అనే అనాధ శరణాలయానికి చెందిన కొందరు విద్యార్ధినులు ఇదే స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ స్కూల్లో ఇద్దరు మహిళా టీచర్లతో పాటు జి. వెంకటేశ్వరరావు, ఎస్. సుందరరావు అనే  ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

వెంకటేశ్వరరావు, సుందరరావులు మొదటి నుండి వక్రబుద్దిని ప్రదర్శిస్తున్నారు. తరగతి గదిలో ఒంటరిగా ఉండే విద్యార్ధినులపై కొంత కాలంగా  లైంగిక దాడకి పాల్పడి పైశాచిక ఆనందానికి పాల్పడేవారు. బాలికలను అర్దనగ్నంగా ఉంచి సెల్‌పోన్ లో పోటోలు తీసి ఆనందాన్ని పొందేవారు.

ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకొని పాఠశాలను అలంకరిస్తున్నారు. ఈ అవకాశాన్ని తీసుకొని ఇద్దరు గిరిజన బాలికలను పాఠశాలపై అంతస్తులోకి తీసుకెళ్లారు ఇద్దరు టీచర్లు. పైకి ఎవరూ రాకుండా అక్కడకు ఎవరూ రాకుండా ఇద్దరు మగ పిల్లలను మెట్లపై కాపలాగా ఉంచారు. 

తరగతి గది లోపల  అమ్మాయిలను అర్ధనగ్నంగా ఉంచి ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాదు తమ సెల్‌ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. పాఠశాలకు హెల్త్ చెకప్ కోసం వైద్యులు రావడంతో  ఇద్దరు విద్యార్ధినులు ఏడ్చారు. 

అసలు విషయాన్ని విద్యార్ధినులు డాక్టర్లకు వివరించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.వేధింపులకు గురైన ఇద్దరు పిల్లలను రహస్యంగా విచారించిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించుకొన్నారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్