లారీ, అంబులెన్స్ ఢీ.. ఇద్దరు మృతి

Published : Nov 26, 2018, 10:08 AM IST
లారీ, అంబులెన్స్ ఢీ.. ఇద్దరు మృతి

సారాంశం

లారీ, అంబులెన్స్ ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన శ్రీకాళహస్తి సమీపంలో చోటుచేసుకుంది

లారీ, అంబులెన్స్ ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన శ్రీకాళహస్తి సమీపంలో చోటుచేసుకుంది. పెషెంట్ ని  తీసుకొని బెంగుళూరు నుంచి నెల్లూరు వెళుతున్న ఓ అంబులెన్స్  సోమవారం ఉదయం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి పంచాయతీ ఇసుకగుంట సమీపంలో నాయుడుపేట-పూతల పట్టు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ డ్రైవర్‌ నిద్రమత్తులో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో డ్రైవర్‌ తో పాటు రోగి మృతిచెందారు. అంబులెన్స్ పూర్తిగా ధ్వంసమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్