సుజనా సంస్థలపై ఈడీ దాడులు.. స్పందించిన సీఎం రమేష్

Published : Nov 26, 2018, 09:57 AM IST
సుజనా సంస్థలపై ఈడీ దాడులు.. స్పందించిన సీఎం రమేష్

సారాంశం

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దాడులపై టీడీపీ ఎంపీ సీఎం రేమేష్ స్పందించారు. 

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దాడులపై టీడీపీ ఎంపీ సీఎం రేమేష్ స్పందించారు. సోమవారం ఉదయం తిరుమల తిరుపతి వెంకన్నను సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్న కారణంతోనే.. టీడీపీపై కేంద్రం కక్ష కట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకు సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం వాడుకుంటోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చెల్లుబాటు కాదని  ఆయన ధ్వజమెత్తారు.బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు దేశవ్యాప్తంగా తిరుగుతూ అందరినీ ఏకం చేస్తుండటంతో వారికి నిద్ర పట్టడంలేదన్నారు. సుజనాచౌదరిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నింటినీ న్యాయబద్దంగా ఎదుర్కొంటామని సీఎం రమేష్‌ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu