ఏలూరులో 18 వీధి కుక్కల దారుణ హత్య.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి.. గ్రామ కార్యదర్శి, సర్ప్ంచ్‌పై కేసు నమోదు

Published : Oct 16, 2022, 08:07 PM IST
ఏలూరులో 18 వీధి కుక్కల దారుణ హత్య.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి.. గ్రామ కార్యదర్శి, సర్ప్ంచ్‌పై కేసు నమోదు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో 18 వీధి కుక్కలను విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేపింది. జంతు ప్రేమికుల ఫిర్యాదుతో గ్రామ కార్యదర్శి, సర్పంచ్‌పై కేసు ఫైల్ చేశారు.  

ఏలూరు: ఏలూరు జిల్లాలో 18 కుక్కలకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉంగటూరు మండలం చేబ్రోలులో ఈ ఘటన జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా కుక్కలకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తిని వీరబాబుగా గుర్తించారు. గ్రామ కార్యదర్శి, సర్పంచ్ భర్తలు సంయుక్తంగా తనకు ఈ ఆదేశాలు ఇచ్చారని, ఆ కుక్కలను చంపాలని ఆదేశించడంతో తాను విషపు ఇంజక్షన్ ఇచ్చినట్టు వీరబాబు తెలిపారు.

ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆందోళన తెలిపారు. వీరబాబును పోలీసులకు అప్పగించారు. గ్రామ  సర్పంచ్, కార్యదర్శిపై ఫిర్యాదు చేశారు. జంతు సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.

Also Read: హృదయవిదారక ఘటన.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడి మృతి.. అక్క కళ్లముందే భయంకరంగా..

సంబంధిత చట్టాల కింద పోలీసులు చేబ్రోలు గ్రామ పంచాయతీ సెక్రెటరీ, గ్రామ సర్పంచ్ పై కేసు నమోదు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Road Accident : చిలకలూరిపేట రోడ్డు ప్రమాదానికి కారణమేంటో తెలుసా?
జగన్ ను ఇమిటేట్ చేసిన లోకేష్ | Nara Lokesh Imitates YS Jagan | Asianet News Telugu