విషాదం: తెల్లారితే శుభకార్యం.. పాలగిన్నెలో పడి చిన్నారి మృతి

By Siva KodatiFirst Published Sep 9, 2019, 10:27 AM IST
Highlights

ఆదివారం లోకేశ్వరయ్య ఇంట్లో శుభకార్యం వుంది. భోజనాల నిమిత్తం పెరుగు కోసం శనివారం రాత్రి పాలను వేడి చేసి... పెద్ద పాత్రలో పోసి చల్లార్చేందుకు ఫ్యాన్ కింద వుంచారు. ఈ సమయంలో దేవాన్ష్ ఆడుకుంటూ వెళ్లి పాలగిన్నెలో పడిపోయాడు.

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏడాదిన్నర చిన్నారి ప్రమాద వశాత్తూ వేడి పాల గిన్నెలో పడి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పెద్దపప్పూరు గ్రామంలోని సుంకులమ్మ కాలనీకి చెందిన లోకేశ్వరయ్య, చంద్రిక దంపతులకు ఇద్దరు కుమారులు.. వీరిలో చిన్నవాడు దేవాన్ష్. ఆదివారం లోకేశ్వరయ్య ఇంట్లో శుభకార్యం వుంది.

భోజనాల నిమిత్తం పెరుగు కోసం శనివారం రాత్రి పాలను వేడి చేసి... పెద్ద పాత్రలో పోసి చల్లార్చేందుకు ఫ్యాన్ కింద వుంచారు. ఈ సమయంలో దేవాన్ష్ ఆడుకుంటూ వెళ్లి పాలగిన్నెలో పడిపోయాడు.

చిన్నారి ఏడుపును విన్న కుటుంబసభ్యులు గిన్నెలోంచి బాలుడిని బయటకు తీసి హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే దేవాన్ష్ ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది

click me!