కర్నూల్ జిల్లాలో మొహర్రం వేడుకల్లో ఉద్రిక్తత,లాఠీచార్జీ

Published : Sep 09, 2019, 07:17 AM IST
కర్నూల్ జిల్లాలో మొహర్రం వేడుకల్లో ఉద్రిక్తత,లాఠీచార్జీ

సారాంశం

కర్నూల్ జిల్లాలో మొహర్రం వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసరకొంది. పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.


కర్నూల్: కర్నూల్ జిల్లా హోనూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకొంది. మొహర్రం వేడుకల్లో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో పోలీసులకు గ్రామస్తులు తిరగబడ్డారు.గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

కర్నూల్ జిల్లాలోని హూసూర్ గ్రామంలో ఆవివారం నాడు రాత్రి మొహర్రం వేడుకల్లో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వేడుకల సమయంలో చోటు చేసుకొన్న చిన్న ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. 

అకారణంగా తమపై పోలీసులు లాఠీ చార్జీ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.లాఠీచార్జీని నిరసిస్తూ పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు.. గ్రామంలోకి వచ్చిన పోలీసు వాహనాలను గ్రామస్థులు దగ్ధం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్