ఎనభై యేళ్ల వృద్ధురాలిపై 16యేళ్ల బాలుడి అత్యాచారం.. ఆరేళ్ల మనవరాలిపై యత్నం... బాలిక అరవడంతో..

Published : Oct 04, 2021, 10:01 AM IST
ఎనభై యేళ్ల వృద్ధురాలిపై 16యేళ్ల బాలుడి అత్యాచారం.. ఆరేళ్ల మనవరాలిపై యత్నం... బాలిక అరవడంతో..

సారాంశం

ఓ వృద్ధురాలిపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమె మనవరాలైన బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన పలమనేరులో జరిగింది. పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో 80యేళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె సమీప బంధువులు ఇక్కడే మరోచోట కాపురం ఉంటున్నారు. 

చిత్తూరు జిల్లా (chittoor district)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయి.. ఓ మైనర్ బాలుడు (minor boy) మంచంలో కదలలేని స్థితిలో ఉన్న 80యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి(Rape) పాల్పడ్డాడు. వింటుంటేనే.. ఛీ.. అనిపిస్తున్న ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. ఆ అవ్వమీద అత్యాచారం చేసిన కీచకుడు ఆరేళ్ల అవ్వ మనవరాలిమీదా అఘాయిత్యానికి (Rape attempt) పాల్పడబోయాడు. 

పెరుగుతున్న విచ్చలవిడితనం, అశ్లీలత.. సమాజం మీద తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తున్నాయనడానికి ఈ ఘటన ఓ నిదర్శనంగా నిలుస్తుంది. అరచేతిలో అందుబాటులో ఉండే ఫోర్న్ సైట్లు యువతను దారుణాలవైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. అడ్డూ,అదుపూ లేకపోవడం, జులాయితనం, ఎవరి భయమూ లేకపోవడం, నన్నెవరేం చేయలేరు అనే అహం.. వెరసి ఆడవారి మీద వయసు, తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడేలా చేస్తున్నాయి. 

ఓ వృద్ధురాలిపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమె మనవరాలైన బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన పలమనేరులో జరిగింది. పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో 80యేళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె సమీప బంధువులు ఇక్కడే మరోచోట కాపురం ఉంటున్నారు. 

దారుణం : కన్నకూతురికి మద్యం తాగించి, లైంగిక దాడి.. ప్రియురాలితో వీడియో తీయించి... !!

అదే కాలనీలో జులాయిగా తిరిగే 16యేళ్ల ఓ బాలుడు శనివారం మధ్యాహ్నం వృద్ధురాలు మంచంమీద కదలలేని స్థితిలో ఉండగా గమనించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గంట తరువాత వృద్ధురాలి మనుమరాలైన ఆరేళ్ల బాలిక అవ్వకోసం భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది. 

బాలికపై కూడా అత్యాచారంం చేసేందుకు ఆ బాలుడు యత్నించాడు. అమ్మాయి భయంతో కేకలు వేయడంతో బాలుడు పారిపోయాడు. పొరుగూరిలో పనులు చూసుకుని ఆదివారం ఇంటిక వచ్చిన తండ్రిక బాలిక జరిగిన సంఘటన గురించి తెలిపింది. సమీప బంధువైన వృద్ధురాలు కూడా దీనిమీద వాపోయింది. దీంతో బాలిక తండ్రి పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వృద్ధురాలు, బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu
ఫ్యూచర్ కోసం ఈ ఏడాది రిజల్యూషన్ తీసుకుందాం: Doctor Ratna Pemmasani | Plastic | Asianet News Telugu