పంక్షన్ కోసం.. పక్కూరికి వెడితే.. బాలిక మీద లైంగిక దాడి.. !

Published : Aug 20, 2021, 09:08 AM IST
పంక్షన్ కోసం.. పక్కూరికి వెడితే.. బాలిక మీద లైంగిక దాడి.. !

సారాంశం

తల్లిదండ్రులు బైటికి వెళ్లగా బుధవారం ఇంటి వద్ద బాలిక ఒంటరిగా ఉంది. ఇది గమనించిన పక్కింట్లోని యువకులు.. బలవంతంగా యువతిని లాక్కెళ్లారు. ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. 

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక మీద లైంగికదాడికి పాల్పడ్డారు కీచకులు. చుట్టపుచూపుగా బంధువుల ఇంటికి వస్తే.. పక్కింట్లోని యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ దారుణం జరిగింది. 

గుంటూరుకు చెందిన దంపతులు తమ కుమార్తె(16)తో కలిసి ఓ కార్యక్రమం కోసం రాజుపాలెం వచ్చారు. తల్లిదండ్రులు బైటికి వెళ్లగా బుధవారం ఇంటి వద్ద బాలిక ఒంటరిగా ఉంది. ఇది గమనించిన పక్కింట్లోని యువకులు.. బలవంతంగా యువతిని లాక్కెళ్లారు. ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. 

ఈ దాడితో ఒంటిమీద గాయాలతో బాలిక ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులు బాలికతో కలిసి గుంటూరు వెళ్లిపోయారు. ఆ తరువాత విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తరఫున అందిన ఫిర్యాదు మేరకు అనుమానితులుగా గల్లా లావాను, మేరుగ సంజీవ్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని ప్రశ్నించగా.. తనమీద ఒక్కరే లైంగిక దాడి చేసినట్లు తెలిపిందని దిశ రూరల్ డీఎస్పీ రవిచంద్ర చెప్పారు.  
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్