కేసీఆర్ అలా.. మంత్రులు ఇలా, ఆయన మాట వినడంలేదేమో: ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై సజ్జల

Siva Kodati |  
Published : Nov 13, 2021, 02:59 PM IST
కేసీఆర్ అలా.. మంత్రులు ఇలా, ఆయన మాట వినడంలేదేమో: ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై సజ్జల

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకు కౌంటరిచ్చారు . 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. శనివారం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) ... విమర్శలు చేయడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా, భేషజాలకు పోకుండా ఏపీతో ఉన్న అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) పలు సందర్భాల్లో చెప్పారని సజ్జల గుర్తుచేశారు. అయినప్పటికీ కేసీఆర్ చెప్పిన మాటలను ఆ రాష్ట్ర మంత్రులు వినడంలేదేమో అని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

అయినా ఏపీ విషయాలు తెలంగాణ మంత్రులకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం హైదరాబాదులోనే కేంద్రీకృతం కావడం వల్ల అందులో వాటా ఇవ్వాలని రాష్ట్ర విభజన (ap bifurcation) సమయంలో అడిగామని సజ్జల గుర్తుచేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీయడం తప్పు అని చంద్రబాబుకు, కాంగ్రెస్ కు అప్పుడే చెప్పామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ విద్యుత్ రంగంపై ఎంత భారం మోపిందో అందరికీ తెలుసునంటూ చంద్రబాబుకు (chandrababu naidu) చురకలు వేశారు. 2014లో డిస్కంల అప్పులు రూ. 33,580గా ఉండగా... టీడీపీ దిగిపోయే సమయానికి అవి రూ. 70,254కి చేరాయని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. డిస్కంలను అప్పుల్లో ముంచెత్తిన వారు తమను ఎలా విమర్శిస్తారని ఆయన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.

Also Read:అందుకే రాష్ట్ర విభజన వద్దన్నాం.. కేసీఆర్ దగ్గర మార్కుల కోసమే ఇలా : ప్రశాంత్ రెడ్డికి సజ్జల కౌంటర్

అంతకుముందు శుక్రవారం ఏపీలోని (ap govt) జగన్ ప్రభుత్వంపై (ys jagan mohan reddy) తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి (prasanth reddy)  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు (paddy) సంబంధించి టీఆర్ఎస్ (trs) శ్రేణులు రైతు ధర్నాలు  చేస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్‌లో శుక్రవారం జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా సీఎం జగన్ నిధులు లేక కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

తెలంగాణ వస్తే అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు (central funds) కావాలని.. కేంద్రం ఒత్తిడితో ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని మంత్రి చెప్పారు. దేశంలోని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కేంద్రం రైతులకు చేస్తున్న మోసంపై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్