నెల్లూరులో కరోనా విలయం.. ఏపీలో మళ్లీ 1500 మార్క్ దాటిన కేసులు, 20,16,807కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Sep 04, 2021, 06:04 PM IST
నెల్లూరులో కరోనా విలయం.. ఏపీలో మళ్లీ 1500 మార్క్ దాటిన కేసులు, 20,16,807కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1502 కరోనా కేసులు నమోదవ్వగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,525 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,833 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్కసారిగా 1500 మార్క్‌ను దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1502 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,16,807కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,903కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 4, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, కర్నూలు 1, ప్రకాశం 1, కృష్ణ 3, పశ్చిమ గోదావరిలలో ముగ్గురు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,525 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,88,021కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 63,717 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,68,73,491కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,833 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 21, చిత్తూరు 208, తూర్పుగోదావరి 191, గుంటూరు 143, కడప 113, కృష్ణ 129, కర్నూలు 20, నెల్లూరు 260, ప్రకాశం 152, శ్రీకాకుళం 38, విశాఖపట్నం 64, విజయనగరం 17, పశ్చిమ గోదావరిలలో 146 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu
తెలుగు రాష్ట్రాల్లోఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్: Andhra Pradesh & Telangana Rain Alert| Asianet Telugu