ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు మినహా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Published : Dec 01, 2020, 06:05 PM IST
ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు మినహా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

సారాంశం

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మినహా 15 మంది ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. 

అమరావతి: ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మినహా 15 మంది ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. 

టిడ్కో ఇళ్లపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో  టీడీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు.టిడ్కో ఇళ్లపై చర్చ సందర్భంగా చంద్రబాబునాయుడు సీఎం జగన్ కు మధ్య మాటల యుద్దం సాగింది.  ఈ సమయంలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.

also read:పిచ్చిపట్టింది, ఎర్రగడ్డకు తీసుకెళ్లండి: జగన్, ఎవరు వెళ్లాలో తేల్చుకొందామన్న బాబు

సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారనే ఉద్దేశ్యంతో  15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు.సోమవారం నాడు అసెంబ్లీ నుండి 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.  సస్పెన్షన్ కు గురైన  ఎమ్మెల్యేలను  ఇవాళ సభ  ముగిసే వరకు సస్పెన్షన్ కు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. 

ఇవాళ ఉదయాన్నే టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడును  ఒక్క రోజు పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు