
విజయవాడ: సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతుందని కన్న కూతురిని తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇలా తల్లి మందలించిందన్న చిన్న కారణంతో మైనర్ బాలిక ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కంచికచర్ల పట్టణంలోని వసంత కాలనీకి చెందిన యర్రగర్ల సుప్రజ(14 ) 9వ తరగతి చదువుతుంది. కరోనా కారణంగా స్కూల్ మూతపడటంతో కేవలం ఆన్ లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి. దీంతో తల్లి మొబైల్ తరవద్దే ఎక్కువగా వుండటంలో సుప్రజ బానిసయ్యింది. ఈ క్రమంలో చీటికీ మాటికీ సెల్ ఫోన్ ఎందుకు చూస్తావంటూ తల్లి బాలికను మందలించింది. దీంతో సుప్రజ తీవ్ర మనస్థాపానికి గురయ్యింది.
వీడియో
తల్లి మందలించిందన్న చిన్న కారణంతో బాలిక ఘోర నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
read more కడప: బ్రహ్మంగారి మఠంలో నడిరోడ్డుపై ఇద్దరు మహిళల నరికివేత, ఉలిక్కిపడ్డ స్థానికులు
ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పిల్లలు సెల్ ఫోన్లో ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు కాబట్టి తల్లిదండ్రులు వారిపై ఓ కన్నేసి వుంచాలని ఎస్సై లక్ష్మీ సూచించారు. ఆన్ లైన్ క్లాసులు పక్కదారిపట్టి చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూడాలని ఎస్సై తల్లిదండ్రులకు సూచించారు.