దేవాదాయశాఖలో ఏసీ,డీసీ మధ్య గొడవపై ఏపీ సర్కార్ సీరియస్: ఆర్‌జేసీ విచారణ

By narsimha lode  |  First Published Aug 6, 2021, 4:34 PM IST

విశాఖ జిల్లాలోని  దేవాదాయశాఖలో  ప్రభుత్వం ఆదేశాలతో ఏసీ, డీసీలను వేర్వేరుగా ప్రశ్నిస్తున్న అధికారులు. గురువారం నాడు డీసీ పుష్పవర్ధన్ పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక, దుమ్ము కొట్టింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
 


విశాఖపట్టణం: దేవాదాయశాఖకు చెందిన ఇదరు కీలక అధికారుల మధ్య  వివాదంపై  ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ విషయమై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.దేవాదాయశాఖకు చెందిన డీసీ పుష్పవర్ధన్ పై అదే శాఖలో  అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతి గురువారం నాడు ఇసుక,దుమ్ము కొట్టారు. తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేక  తాను ఇసుక, దుమ్ము కొట్టానని ఆమె మీడియాకు చెప్పారు.

also read:దేవాదాయశాఖలో అధికారుల మధ్య గొడవ: డీసీపై ఇసుక, మట్టిపోసిన ఏసీ శాంతి

Latest Videos

ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. వెంటనే విచారణ చేయాలని దేవాదాయశాఖాధికారులను ఆదేశించింది. ఆర్‌జేసీ సురేష్‌కుమార్ ను  విచారణాధికారిగా నియమించారు.అసిస్టెంట్ కమిషనర్ శాంతి, డీసీ పుష్పవర్ధన్ లతో ఆర్‌జేసీ సురేష్ వేర్వేరుగా విచారణ నిర్వహిస్తున్నారు. గతంలో కూడ డీసీ పుష్పవర్ధన్ పై ఏసీ శాంతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై రాజమండ్రిలో ఉన్నతాధికారులు విచారణకు పిలిచారు. అయితే ఆ సమావేశానికి  డీసీ పుష్పవర్ధన్ హాజరు కాలేదని ఏసీ శాంతి మీడియాకు నిన్న తెలిపారు.
 

click me!