ఏపీ అసెంబ్లీలో గందరగోళం: 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

By narsimha lode  |  First Published Sep 21, 2023, 11:22 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి  14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి  గురువారంనాడు  14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మరో వైపు ఈ సమావేశాలు ముగిసే వరకు  టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్  పోడియం వద్ద నిరసనకు దిగారు.  స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ  మీసం తిప్పారు. బాలకృష్ణకు  వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తొడగొట్టి కౌంటరిచ్చారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పోటా పోటీగా  నిరసనలకు దిగారు. దీంతో సభను  వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.ఆ తర్వాత సభ ప్రారంభమైన వెంటనే  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. సభా సంప్రదాయాలకు విరుద్దంగా  వ్యవహరించిన బాలకృష్ణను మొదటి తప్పుగా పరిగణించి వదిలేస్తున్నట్టుగా చెప్పారు. మరో వైపు సభా సంప్రదాయాలను ఉల్లంఘించిన  టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, టీడీపీకి మద్దతు ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు  సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా  స్పీకర్ ప్రకటించారు.

Latest Videos

undefined

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడ సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ పై  వాయిదా తీర్మానంపై  టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు. అయితే ఈ వాయిదా తీర్మాణాన్ని తిరస్కరిస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.  

also read:ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన,గందరగోళం: వాయిదా

టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు.ఈ సమయంలో  ఏపీ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  జోక్యం చేసుకున్నారు. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నందుకు 14 మంది టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తూ  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  తీర్మానం ప్రవేశ పెట్టారు.ఈ తీర్మాణానికి సభ ఆమోదం తెలిపింది. సస్పెన్షన్ కు గురైన టీడీపీ సభ్యులు సభలోనే  నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీని  వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

   
 

click me!