బ్రహ్మంగారి మఠంలో వివాదం: కందిమల్లాయపల్లి గ్రామస్తులతో 14 మంది పీఠాధిపతులు చర్చలు

By narsimha lodeFirst Published Jun 3, 2021, 10:41 AM IST
Highlights

కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మఠం పీఠాధిపతి పదవి కోసం వారసుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు 14 పీఠాధిపతులు ప్రయత్నాలు ప్రారంభించారు. 

కడప:కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మఠం పీఠాధిపతి పదవి కోసం వారసుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు 14 పీఠాధిపతులు ప్రయత్నాలు ప్రారంభించారు. బ్రహ్మంగారిమఠానికి సంబంధించి వారసుల మధ్య చోటు చేసుకొన్న వివాదాలను పరిష్కరించేందుకు పలు పీఠాధిపతులు ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం నాడు బ్రహ్మంగారి పీఠానికి 14 పీఠాధిపతులు చేరుకొన్నారు.

also read:బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి: వారసుల మధ్య రాజీకి 14 మఠాధిపతుల రాక, అనుమతి లేదన్న పోలీసులు

కందిమల్లాయపల్లె గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కొడుకుకు పీఠాధిపతి పదవి ఇవ్వాలని కోరుతున్నారు.ఈ విషయమై వారంతా ఇవాళ ఆందోళనకు సిద్దమయ్యారు. దీంతో పీఠాధిపతులు వారితో చర్చించనున్నారు. గ్రామస్తులు ఆందోళనకు సిద్దమైన విషయం తెలుసుకొన్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు.పీఠాధిపతి పదవి విషయమై వారసులతో పాటు గ్రామస్తులతో చర్చించిన మీదట పీఠాధిపతులు  దేవాదాయశాఖకు నివేదిక సమర్పించనున్నారు. 

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో వారసుల మధ్య  చిచ్చు రగిలింది.  బ్రహ్మంగారి శిష్యులతో పాటు వారసులతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకొస్తామని పీఠాధిపతులు చెబుతున్నారు. బ్రహ్మంగారి మఠం ఏడో తరానికి చెందిన పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించాడు. నూతన పీఠాధిపతి ఎంపిక విషయంలో కుటుంబసభ్యుల మధ్య గొడవలు సాగుతున్నాయి. ఇటీవలే మరణించిన వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు నలుగు కొడుకులు, నలుగురు కూతుళ్లు, రెండో భార్యకు ఇద్దరు కొడుకులున్నారు.

పీఠాధిపతి పదవి తనకే కావాలని పెద్ద భార్య  చంద్రావతమ్మ కొడుకు కోరుతున్నాడు.  ఈ పదవిని తన కొడుకుకు ఇవ్వాలని వసంత వెంకటేశ్వరస్వామి వీలునామా రాశాడని రెండో భార్య మహాలక్ష్మమ్మ చెబుతోంది. కందిమల్లాయపల్లె గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కొడుకుకు పీఠాధిపతి పదవి ఇవ్వాలని కోరుతున్నారు.  కందిమల్లాయపల్లె గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కొడుకుకు పీఠాధిపతి పదవి ఇవ్వాలని కోరుతున్నారు.

click me!