ప్రేమపేరుతో వాడుకుని.. ఉద్యోగం వచ్చాక మొహం చాటేశాడు..

Published : Jun 03, 2021, 09:43 AM IST
ప్రేమపేరుతో వాడుకుని.. ఉద్యోగం వచ్చాక మొహం చాటేశాడు..

సారాంశం

తోటి విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లోబరుచుకున్నాడు. తీరా ఉద్యోగం వచ్చాక తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. మోసాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, పెద్దలు కౌన్సెలింగ్ ఇచ్చినా వివాహానికి నిరాకరించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన మెరుపుల నాగేంద్ర, రామభద్రపురానికి చెందిన ఓ విద్యార్తిని 2014 నుంచి బొబ్బిలి రాజా కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో ప్రేమగా మారింది. ఉద్యోగం వస్తే వివాహం చేసుకుంటానని నమ్మించి శారిరకంగా దగ్గరయ్యాడు. మూడు నెలల కిందట ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో నాగేంద్రకు ఉద్యోగం వచ్చింది. 

ఆ తర్వాత తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. దీంతో ఆ అమ్మాయి మే 31వ తేదీన పోలీసుకు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేశారు. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం సాలూరుకు రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై కృష్ణమూర్తిలో కలిసి సాలూరు సర్కిల్ ఇన్స్ పెక్టర్ అప్పలనాయుడు విలేకరులకు వెల్లడించారు. 
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu