14 మండలాలపై ఫణి తుఫాన్ ప్రభావం: చంద్రబాబు

Published : May 03, 2019, 04:54 PM IST
14 మండలాలపై ఫణి తుఫాన్ ప్రభావం: చంద్రబాబు

సారాంశం

 టెక్నాలజీ సహాయంతో ఫణి తుఫాన్  వల్ల నష్ట తీవ్రతను తగ్గించినట్టుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రేపటి వరకు అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు  నెలకొనే అవకాశం ఉందని   ఆయన అభిప్రాయపడ్డారు. 

అమరావతి:  టెక్నాలజీ సహాయంతో ఫణి తుఫాన్  వల్ల నష్ట తీవ్రతను తగ్గించినట్టుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రేపటి వరకు అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు  నెలకొనే అవకాశం ఉందని   ఆయన అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం నాడు అమరావతిలో  ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కవిటి, మందస, ఇచ్ఛాపురం మండలాల్లో సాధారణ ఫణి తుఫాన్ ప్రభావం  ఎక్కువగా కన్పించిందన్నారు. ఇప్పటికే 9 మండలాల్లో సాధారణ  పరిస్థితులను తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.

విద్యుత్ పునరుద్దరణ కోసం అధికారులు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు.పునరావాస కేంద్రాల్లో భోజన వసతి కల్పించామన్నారు.  సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు బాధిత ప్రజలకు భోజనం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏ విభాగంలో ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే విషయమై సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా  బాబు తెలిపారు.అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసినట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు. తుఫాన్ ప్రభావం 14 మండలాలపై ఉందన్నారు.

టెక్నాలజీ సహాయంతో కచ్చితమైన సమాచారం ఆధారంగా ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకొన్నామని బాబు చెప్పారు.ఒడిశా రాష్ట్ర సీఎంతో తాను రెండు సార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా బాబు వివరించారు.  రియల్ టైమ్ గవర్నెస్ ద్వారా ఏపీ అధికారులు సమాచారం చాలా కచ్చితంగా ఉందని  ఒడిశా అధికారులు అభినందించారని బాబు వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu