ఏపీలో భారీగా తగ్గిన కేసులు: కలవరపెడుతున్న మరణాలు, ఒక్కరోజే ప.గోలో 20 మంది మృతి

By Siva Kodati  |  First Published May 29, 2021, 6:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. కర్ఫ్యూ అమలు చేస్తుండటం మంచి ఫలితాలు ఇస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో రెండు వారాలు పగటిపూట కర్ఫ్యూను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. కర్ఫ్యూ అమలు చేస్తుండటం మంచి ఫలితాలు ఇస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో రెండు వారాలు పగటిపూట కర్ఫ్యూను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 13,756 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,71,742 చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,738కి చేరుకుంది.

Latest Videos

undefined

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 6, ప్రకాశం 8, అనంతపురం 9, తూర్పుగోదావరి 9, చిత్తూరు 13, గుంటూరు 8, కర్నూలు 7, నెల్లూరు 6, కృష్ణ 8, విశాఖపట్నం 10, శ్రీకాకుళం 5, పశ్చిమ గోదావరి 20, ప్రకాశం 1, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 20,392 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 14,87,382కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 79,564 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,90,88,611కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,73,622 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1224, చిత్తూరు 2155, తూర్పుగోదావరి 2031, గుంటూరు 780, కడప 632, కృష్ణ 782, కర్నూలు 742, నెల్లూరు 865, ప్రకాశం 811, శ్రీకాకుళం 666, విశాఖపట్నం 1004, విజయనగరం 397, పశ్చిమ గోదావరిలలో 1397 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

: 29/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,68,847 పాజిటివ్ కేసు లకు గాను
*14,84,487 మంది డిశ్చార్జ్ కాగా
*10,738 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,73,622 pic.twitter.com/mw1wvZdAUD

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!