ప్రైవేట్ ఆసుపత్రుల దందా: అధిక ఫీజులపై 104కి కాల్ చేయండి.. ప్రజలకు ఆళ్ల నాని సూచన

By Siva KodatiFirst Published May 29, 2021, 3:57 PM IST
Highlights

ప్రైవేట్ ఆసుపత్రుల అధిక ఫీజులపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఫైరయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రులపై విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డు వున్నా అడ్వాన్స్ పేమెంట్స్ వ్యవహారంపై విచారణ జరపాలని నాని సూచించారు. 

ప్రైవేట్ ఆసుపత్రుల అధిక ఫీజులపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఫైరయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రులపై విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డు వున్నా అడ్వాన్స్ పేమెంట్స్ వ్యవహారంపై విచారణ జరపాలని నాని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆళ్ల నాని ఆదేశించారు.

Also Read:ఏపీలో కర్ఫ్యూ పొడగింపునకు జగన్ ఆలోచన: చిత్తూరులో జూన్ 15 వరకు పొడగింపు

కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించాలని మంత్రి మండిపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు కేటాయించాలని ఆళ్ల నాని కోరారు. రెమ్‌డిసివర్ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే 104 కాల్ సెంటర్‌కి ఫిర్యాదు చేయాలని ఆళ్ల నాని ప్రజలకు సూచించారు. 
 

click me!