ఏపీలో స్వల్పంగా పెరిగిన కేసులు: కొత్తగా 1,365 మందికి పాజిటివ్‌.. చిత్తూరు, తూ.గోలలో తీవ్రత

Siva Kodati |  
Published : Sep 22, 2021, 05:57 PM ISTUpdated : Sep 22, 2021, 05:58 PM IST
ఏపీలో స్వల్పంగా పెరిగిన కేసులు: కొత్తగా 1,365 మందికి పాజిటివ్‌.. చిత్తూరు, తూ.గోలలో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 1,365 కరోనా కేసులు నమోదవ్వగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,466 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,796 మంది చికిత్స పొందుతున్నారు.    

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,365 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,39,178కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,097కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణ 2, చిత్తూరు 2, నెల్లూరు , తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,466 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,11,285కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 56,720 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,78,70,218కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,796 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 4, చిత్తూరు 212, తూర్పుగోదావరి 210, గుంటూరు 131, కడప 153, కృష్ణ 104, కర్నూలు 1, నెల్లూరు 137, ప్రకాశం 166, శ్రీకాకుళం 22, విశాఖపట్నం 49, విజయనగరం 19, పశ్చిమ గోదావరిలలో 157 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu