దారుణం: భార్య ప్రాణం తీసుకుంటుంటే.. ఆపకపోగా, సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన భర్త

Siva Kodati |  
Published : Sep 22, 2021, 05:39 PM ISTUpdated : Sep 22, 2021, 05:47 PM IST
దారుణం: భార్య ప్రాణం తీసుకుంటుంటే.. ఆపకపోగా, సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన భర్త

సారాంశం

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. భర్త ఎదుటే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది భార్య. ఉరి వేసుకుంటూ వుంటుంటే ఆపాల్సిందిపోయి వీడియో తీశాడు ఆమె భర్త. విషయం తెలుసుకున్న పోలీసులు భర్త పెంచలయ్యను అరెస్ట్ చేశారు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. భర్త ఎదుటే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది భార్య. ఉరి వేసుకుంటూ వుంటుంటే ఆపాల్సిందిపోయి వీడియో తీశాడు ఆమె భర్త. విషయం తెలుసుకున్న పోలీసులు భర్త పెంచలయ్యను అరెస్ట్ చేశారు. బెదిరిస్తున్నాడని అనుకున్నాడో లేక  నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని ఉరుకున్నాడో తెలియదు గానీ.. కళ్లెదుటే భార్య ప్రాణాలు తీసుకుంటున్నా పట్టించుకోలేదు. పైగా ఆమెను ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరిపించాడు పెంచలయ్య. ఉరేసుకుంటున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెంచలయన్యను అరెస్ట్ చేశారు. మృతురాలిని ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న కొండమ్మగా గుర్తించారు. అటు పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మెప్మా సిబ్బంది ఆందోళనకు దిగారు. 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్