జనంలోకి జగన్.. డిసెంబర్ నుంచి జిల్లాల టూర్, గ్రామ సచివాలయాల తనిఖీ

Siva Kodati |  
Published : Sep 22, 2021, 05:22 PM IST
జనంలోకి జగన్.. డిసెంబర్ నుంచి జిల్లాల టూర్, గ్రామ సచివాలయాల తనిఖీ

సారాంశం

కరోనా కారణంగా గడిచిన ఏడాదిన్నరగా క్యాంప్ కార్యాలయానికే పరిమితమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ జనంలోకి వెళ్లబోతున్నారు. డిసెంబర్ నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు.  ప్రతి నెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్‌రిచ్ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం జగన్... స్పందన కార్యక్రమంలో తెలిపారు. 

కరోనా కారణంగా గడిచిన ఏడాదిన్నరగా క్యాంప్ కార్యాలయానికే పరిమితమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ జనంలోకి వెళ్లబోతున్నారు. డిసెంబర్ నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సంకేతాలిచ్చారు సీఎం వైఎస్ జగన్. విలేజ్, వార్డు సచివాలయాల తనిఖీలు చేయాలని.. నిర్లక్ష్యంగా వున్న వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు కూడా గ్రామ సచివాలయాలను ఎప్పటికప్పుడు సందర్శించాలని ఆయన ఆదేశించారు. ప్రతి నెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్‌రిచ్ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం జగన్... స్పందన కార్యక్రమంలో తెలిపారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి 4 గ్రామ సచివాలయాలు సందర్శించాలని జగన్ ఆదేశించారు. డిసెంబర్ నుంచి తాను కూడా గ్రామ సచివాలయాలను సందర్శిస్తానని సీఎం చెప్పారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

నాకెప్పుడూ ఇలాంటి ఆలోచన రాలేదు జగన్ కి వచ్చింది అందుకే.. Chandrababu on Jagan | Asianet News Telugu
రైతులందరికీ ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం: CM Chandrababu Speech | Solar | Farmers | Asianet News Telugu