ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 13,212 మందికి పాజిటివ్, విశాఖలో భయానకం

Published : Jan 21, 2022, 06:06 PM IST
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 13,212 మందికి పాజిటివ్, విశాఖలో భయానకం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,212 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 21,50,373కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,212 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 21,50,373కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,532కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 2,942 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,71,705కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 44,516 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,20,56,618కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 64,136 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 1235, చిత్తూరు 1585, తూర్పుగోదావరి 816, గుంటూరు 1054, కడప 649, కృష్ణ 338, కర్నూలు 961, నెల్లూరు 1051, ప్రకాశం 772, శ్రీకాకుళం 1230, విశాఖపట్నం 2244, విజయనగరం 681, పశ్చిమ గోదావరిలలో 596 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

కాగా.. దేశంలో కరోనా కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు మూడున్నర లక్షల కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు సాధారణంగా మరింత కఠినం చేయాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చేలా నిబంధనలు సవరించింది. మన దేశంలో దిగగానే వారికి కరోనా పాజిటివ్ వచ్చినా.. నెగెటివ్ వచ్చినా.. తప్పనిసరిగా ఏడు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలని ప్రస్తుత ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, తాజాగా కరోనా పాజిటివ్  తేలిన విదేశీ ప్రయాణికులను ఐసొలేషన్ ఫెసిలిటీలో ఉంచడం తప్పనిసరి కాదని వెల్లడించింది.

ఒమిక్రాన్ వేరియంట్ రిస్క్ దేశమైనా.. రిస్క్ లేని దేశమైనా సరే.. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు మన దేశంలో అడుగు పెట్టగానే ఒక వేళ కరోనా పాజిటివ్ అని తేలినా.. నిర్దేశిత నిబంధనల ప్రకారం ట్రీట్‌మెంట్ అందించాలని గురువారం విడుదల చేసిన మార్గదర్శకాలు తెలిపాయి. నిర్దేశిత నిబంధనల ప్రకారం ట్రీట్‌మెంట్ అందించాలని, ఆ నిబంధనల ప్రకారమే ఐసొలేషన్ ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. అంతేకానీ, అందరికీ ఐసొలేషన్ తప్పనిసరి కాదని సవరించిన గైడ్‌లైన్స్ పేర్కొంటున్నాయి.  విదేశాల నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా ఐసొలేషన్ ఫెసిలిటీలో మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.

గురువారం విడుదలైన ఈ నిబంధనలు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది. అయితే, మిగిలిన నిబంధనలు అన్నీ ఈ సవరించిన గైడ్‌లైన్స్‌లోనూ ఉంటాయని తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా ఐసొలేషన్ ఫెసిలిటీలో ఉండాలనే మాట.. ఈ సవరించిన గైడ్‌లైన్స్‌లో లేదు. స్క్రీనింగ్ చేస్తుండగా ఎవరైనా ప్రయాణికుడికి కరోనా లక్షణాలు కనిపిస్తే.. హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం, సదరు వ్యక్తిని వెంటనే ఐసొలేట్ చేసి మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్లాలి. ఒక వేళ అతనికి కరోనా పాజిటివ్ అని తేలితే.. వెంటనే ఆయన కాంటాక్టులను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టాలి.

 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu