రేణిగుంట ఎయిర్‌పోర్ట్ ప్రైవేటీకరణ: కేంద్రం గ్రీన్‌సిగ్నల్

By narsimha lode  |  First Published Sep 12, 2021, 10:36 AM IST

చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టును ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకొన్న నిర్ణయాలపై విపక్షాలపై విమర్శలు చేస్తున్నాయి.


తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.దేశవ్యాప్తంగా 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.  ఇందులో రేణిగుంట ఎయిర్ పోర్టు కూడ ఉంది 

భువనేశ్వర్, వారణాసి, అమృత్‌సర్, తిరుచ్చి, ఇండోర్, రాజ్‌పుర్ లాంటి పెద్ద ఎయిర్ పోర్టులతో పాటు జర్సుగూడ, గయ, కుషినగర్, కంగ్రా, తిరుపతి(రేణిగుంట), జబల్‌పూర్, జల్‌గామ్ ఎయిర్ పోర్టులను కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకొంది. చిన్న ఎయిర్ పోర్టులను పెద్ద ఎయిర్‌పోర్టుల పరిధిలో విలీనం చేయనున్నారు.

Latest Videos

undefined

జార్సుగూడ ఎయిర్ పోర్టును భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో విలీనం చేస్తారు. కిషినగర్, గయ విమానాశ్రయాలను వారణాసిలో కలుపుతారు. అమృత్ సర్, జల్గావ్, తిరుచ్చి విమానాశ్రయాలలో రాయ్ పూర్, జబల్పూర్, ఇండోర్, తిరుపతి(రేణిగుంట) లను విలీనం చేయనున్నారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు  కేంద్రం ఈ మేరకు బిడ్డర్లను ఆహ్వానిస్తోంది.కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం ద్వారా  ఆదాయాన్ని సంపాదించుకోవాలని భావిస్తోంది.ఈ విషయమై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. 


 

click me!