గుత్తిలో విషాదం: వినాయకమండపం వద్ద డ్యాన్స్ చేస్తూ మృతి

Published : Sep 12, 2021, 09:30 AM IST
గుత్తిలో విషాదం: వినాయకమండపం వద్ద డ్యాన్స్ చేస్తూ మృతి

సారాంశం

అనంతపురం గుత్తిలో వినాయకుడి మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ  ఓ యువకుడు మరణించారు. గుత్తిలోని గౌతమీనగర్ కాలనీలో  వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ పుల్లయ్య అనే కుప్పకూలి మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తిలో  విషాదం చోటు చేసుకొంది. వినాయకమండపం వద్ద డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలి మృతి చెందాడు.ఈ ఘటన స్థానికంగా  విషాదాన్ని నింపింది.గుత్తి పట్టణంలోని గౌతమిపురి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకమండపం వద్ద  పుల్లయ్య అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.  

అతడితో మరో వ్యక్తి డ్యాన్స్ చేసేందుకు వచ్చిన సమయంలోనే పుల్లయ్య కుప్పకూలిపోయాడు. అతడిని పైకి లేపి చూసేసరికి ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.  వైద్యులు పరీక్షించి పుల్లయ్య మరణించినట్టుగా ధృవీకరించారు. పుల్లయ్య  మరణించడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

వినాయకమండపం ముందు తమ కళ్ల ముందు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన పుల్లయ్య మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పుల్లయ్య మృతితో స్థానిక కాలనీవాసులు కూడ  విషాదంలో మునిగిపోయారు. పుల్లయ్య మృతిపై పోస్టుమార్టం నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?