ఏపీలో కరోనా తగ్గుముఖం: మరణాల్లో జోరు.. ప.గోకు ఊరట, చిత్తూరులో భయానకం

Siva Kodati |  
Published : Jun 02, 2021, 05:03 PM IST
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరణాల్లో జోరు.. ప.గోకు ఊరట, చిత్తూరులో భయానకం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 12,768 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు.. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 12,768 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,17,156కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 98 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,132కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 8, ప్రకాశం 8, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, చిత్తూరు 15, గుంటూరు 7, కర్నూలు 4, నెల్లూరు 10, కృష్ణ 5, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 9, ప్రకాశం 7, కడపలో నలుగురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 15,612 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 15,62,229కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 98,048 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,94,48,056కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,43,795 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1506, చిత్తూరు 1551, తూర్పుగోదావరి 2703, గుంటూరు 765, కడప 699, కృష్ణ 841, కర్నూలు 474, నెల్లూరు 785, ప్రకాశం 734, శ్రీకాకుళం 561, విశాఖపట్నం 844, విజయనగరం 253, పశ్చిమ గోదావరిలలో 1052 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ