విశాఖలో భయపెడుతున్న బ్లాక్ ఫంగస్, ఆరుగురి మృతి.. సెంచరీకి చేరువలో కేసులు

By Siva Kodati  |  First Published Jun 2, 2021, 4:26 PM IST

విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ బుసలు కొడుతోంది. కరోనా బారినపడి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ శాపంలా మారుతోంది. జిల్లాలో బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న వారి సంఖ్య వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది


విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ బుసలు కొడుతోంది. కరోనా బారినపడి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ శాపంలా మారుతోంది. జిల్లాలో బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న వారి సంఖ్య వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన రెండు రోజుల్లో మరో 20 మంది బ్లాక్ ఫంగస్ లక్షణాలతో కేజీహెచ్‌లో చేరారు. వారికి వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించారు అధికారులు. జిల్లాలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువలో వుంది. వీరందరికీ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

Also Read:విషాదం : తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు.. తనతో కాదంటూ వదిలేసి వెళ్లిన కొడుకు..

Latest Videos

మరోవైపు బ్లాక్ ఫంగస్ బారినపడిన మరో ఇద్దరికి కేజీహెచ్‌లో వైద్యుల బృందం ఆపరేషన్లు నిర్వహించింది. వీరిలో ఒక మహిళ, పురుషుడు వున్నారు. ఒకరికి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ నిర్వహించగా.. మరోకరికి కంటిని తొలగించి ముక్కు లోపల వున్న ఫంగస్‌ను తీసేశారు వైద్యులు. గజరెడ్డిపాలెనికి చెందిన చేపల చలపతిరావు అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్‌కు చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న అతను.. బ్లాక్ ఫంగస్ సోకి నాలుగు రోజుల క్రితం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో బ్లాక్ ఫంగస్‌ బారినపడిన వారిలో టెన్షన్  మొదలైంది. 
 

click me!