కొత్తగా 1,221 మందికి పాజిటివ్: ఏపీలో 8.60 లక్షలకు చేరువలో కేసులు

By Siva Kodati  |  First Published Nov 20, 2020, 7:20 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,221 కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,59,932కి చేరింది


రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,221 కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,59,932కి చేరింది.

నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా 10 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,920కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,829 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,37,630కి చేరింది.

Latest Videos

undefined

ప్రస్తుతం ఏపీలో 15,382 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే అనంతపురం 41, చిత్తూరు 175, తూర్పుగోదావరి 202, గుంటూరు 144, కడప 65, కృష్ణ 198, కర్నూలు 19, నెల్లూరు 47, ప్రకాశం 50, శ్రీకాకుళం 34, విశాఖపట్నం 69, విజయనగరం 32, పశ్చిమగోదావరిలలో 145 కేసులు నమోదయ్యాయి.

అలాగే చిత్తూరు, కృష్ణాలలో ఇద్దరు చొప్పున.. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

 

 

: 20/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,57,037 పాజిటివ్ కేసు లకు గాను
*8,34,735 మంది డిశ్చార్జ్ కాగా
*6,920 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,382 pic.twitter.com/1MsqvWCAI2

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!