24 గంటల్లో 19 మంది మృతి: ఏపీలో 29,168కి చేరిన కరోనా కేసులు

By narsimha lode  |  First Published Jul 12, 2020, 3:10 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,933 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 29,168కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో కరోనాతో 328 మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,933 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 29,168కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో కరోనాతో 328 మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో కరోనా సోకినప్పటికి 15,412 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 13,428  యాక్టివ్ కేసులు నమోదైనట్టుగా  ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది.

Latest Videos

గత 24 గంటల్లో 17,624 శాంపిల్స్ పరీక్షిస్తే 1933 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. ఒక్క రోజులోనే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 18 మందికి, విదేశాల నుండి వచ్చిన ఒక్కరికి కరోనా సోకినట్టుగా ఏపీ సర్కార్ తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 11,53,849 మంది శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలోని 13,428 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో 3405 మందికి కరోనా సోకింది. అనంతపురంలో 3290, గుంటూరులో 3019, చిత్తూరులో 2668, తూర్పుగోదావరిలో 2642 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కర్నూల్ లో నలుగురు, కృష్ణా,విశాఖపట్టణంలో ముగ్గురేసి చొప్పున, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరిలో ఒక్కరి చొప్పున మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

click me!