సంచలనం సృష్టించిన కర్నూలు జంట హత్యల కేసులో 12 మంది అరెస్ట్..

Published : Jan 29, 2022, 08:42 AM IST
సంచలనం సృష్టించిన కర్నూలు జంట హత్యల కేసులో 12 మంది అరెస్ట్..

సారాంశం

జనవరి 27న కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంలో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షలు, భూతగాదాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఇద్దరిని అతి దారుణంగా హత్య చేసేలా దారితీశాయి.  వైసీపీకి చెందిన శివప్ప, ఈరన్నలపై వేట కొడవళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు..పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటనలో శివప్ప, ఈరన్నలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలానికి దారి తీసింది. 

ఆదోని : Kurnool District కౌతాళం మండలంలో గురువారం జరిగిన double murders కేసులో 12 మందిని పోలీసులు arrest చేశారు. శుక్రవారం ఆదోనిలో డీఎస్పీ వినోద్ కుమార్ తో కలిసి ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. కామవరంలో ఓ Land dispute విషయమై మాట్లాడేందుకు గురువారం అదే గ్రామానకి చెందిన శివప్ప, ఈరన్న అలియాస్ భాస్కర్ లతో పాటు కొంతమంది వడ్డే మల్లికార్జున ఇంటికి వెళ్లారు. 

ఆ సమయంలో Lethal weaponsతో జరిగిన దాడిలో శివప్ప, ఈరన్న మృతి చెందారు. మరి కొంతమంది గాయపడ్డారు. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తునకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులైన వడ్డే మల్లికార్జున, వడ్డే గోపాల్, వడ్డే రాజు, వడ్డే ఈశ్వర్, వడ్డే చంద్ర, వడ్డే హనుమంతు.. వీరికి సహకరించిన కౌతాళంకు చెందిన బాపురం రామకృష్ణ పరమహంస అలియాస్ చాకలి రామకృష్ణలను హైదరాబాద్ లో, వడ్డే ఉలిగమ్మ, వడ్డే జయమ్మ,  వడ్డే ఈరమ్మ, వడ్డే లక్ష్మిలను ఎమ్మిగనూరు మండలం మాసుమానుదొడ్డి గ్రామంలో అరెస్ట్ చేశారు. 

murdersకు ప్రధాన కారణం భూ తగాదాలేనని, నిందితుల మీద హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేసిన సీఐలు, ఎస్సైలను అభినందించారు. 

కాగా, జనవరి 27న కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంలో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షలు, భూతగాదాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఇద్దరిని అతి దారుణంగా హత్య చేసేలా దారితీశాయి.  వైసీపీకి చెందిన శివప్ప, ఈరన్నలపై వేట కొడవళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు..పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటనలో శివప్ప, ఈరన్నలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలానికి దారి తీసింది. 

వీరిపై బీజేపీకి చెందిన మల్లికార్జున, అతని వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడి, హత్యలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్షసాక్షులు, ఘటనస్థలంలోని ఆనవాళ్లతో ప్రాథమిక వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

వివరాలు.. కామవరం గ్రామంలోని శివప్ప, ఈరన్న వర్గానికి.. అదే గ్రామానికి చెందిన మల్లికార్జున వర్గానికి మధ్య చాలా కాలంగా భూవివాదం ఉంది. ఇందులో మల్లికార్జున వర్గం బీజేపీలో కొనసాగుతుంటే.. శివప్ప వర్గం వైసీపీలో ఉంది. ఆదోనిలో ఉంటున్న ఓ వ్యక్తకి చెందిన భూమి కామవరం గ్రామానికి చెందిన బీజేపీ వర్గీయుడి ఆధీనంలో ఉంది. ఈ భూమి విషయంలో గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, బీజేపీ వర్గీయుడి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 

దీంతో తమ నాయకుడి మీద ఎలా ఆరోపణలు చేస్తున్నారని గురువారం రోజు ఉదయం 11 గంటల సమయంలో బీజేపీ వర్గీయుల ఇంటికి వెళ్లి ప్రశ్నించారు.దీంతో ఈ సమయంలో ఇరువర్గాల మధ్య మాటా, మాటా పెరిగి.. ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే మల్లికార్జున వర్గీయులు శివప్ప, ఈరన్నలపై దాడికి పాల్పడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్