మద్యం మత్తులో భార్యను, అత్తను నరికి చంపి.. తానూ పొడుచుకుని.. శ్రీకాకుళం జిల్లాలో దారుణం..

Published : Jan 29, 2022, 08:16 AM ISTUpdated : Jan 29, 2022, 08:19 AM IST
మద్యం మత్తులో భార్యను, అత్తను నరికి చంపి.. తానూ పొడుచుకుని.. శ్రీకాకుళం జిల్లాలో దారుణం..

సారాంశం

కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు బెంగళూరులో తాపీ పనులు చేస్తూ ఉంటాడని తెలుస్తోంది. పండుగకు అత్తవారింటికి వచ్చాడని, ఈ సందర్భంగానే ఇంట్లో గొడవలు జరిగాయని అంటున్నారు. 

శ్రీకాకుళం : Srikakulam Districtలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యను, అత్తను ఓ వ్యక్తి నరికి murder చేశాడు. శ్రీకాకుళం జిల్లా ముద్దాడపేటలో ఈ సంఘటన చోటు చేసుకుంటున్నాడు. మద్యం మత్తులో అతను ఈ ఘటనకు పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన ఇతర కుటుంబ సభ్యులపై కూడా అతను కత్తితో attack చేశాడు. అతని దాడిలో ఇద్దరు మరణించడంతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. నిందితుడు అప్పన్నగా గుర్తించారు.

గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు బెంగళూరులో తాపీ పనులు చేస్తూ ఉంటాడని తెలుస్తోంది. పండుగకు అత్తవారింటికి వచ్చాడని, ఈ సందర్భంగానే ఇంట్లో గొడవలు జరిగాయని అంటున్నారు. విపరీతంగా మద్యం సేవించిన అతను ఈ దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నారు.

nellore district ఆత్మకూరు పట్టణానికి చెందిన Penchalaya అనే వ్యక్తి భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగి suicide attemptకి పాల్పడ్డాడు. అయితే ఇదంతా Selfie video తీసుకుని whatsapp లో షేర్ చేయడంతో సంచలనంగా మారింది.  గతంలో అతడి భార్య suicide చేసుకుంటుంటే పెంచలయ్య వీడియో తీయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  

పెంచలయ్య ఆత్మకూరులోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. భర్త వేధింపులు భరించలేక భార్య కొండమ్మ  నిరుడు సెప్టెంబర్ 21న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో భార్య సమాధి వద్దకు వెళ్లిన పెంచలయ్య.. తన భార్య చావుకు,  తన చావుకు ఆరుగురు కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం  గమనార్హం. ఇదే విషయాలను చెబుతూ  సెల్ఫీ వీడియో తీసి వాట్స్అప్ గ్రూపులో షేర్ చేశాడు. 

ఆ తర్వాత పురుగుల మందు తాగడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ వీడియో చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి  చేరుకున్నారు. బాధితుడిని వైద్యం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం  నెల్లూరుకు తరలించారు.  ప్రస్తుతం పెంచలయ్య ఆరోగ్య పరిస్థితి  విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 

నిరుడు సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భర్త ఎదుటే ఉరివేసుకుని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సింది పోయి వీడియో తీశాడు ఆ భర్త. ఆ తరువాత ఈ వీడియో వైరల్ కావడంతో... విషయం తెలుసుకున్న పోలీసులు భర్త  పెంచలయ్యను అరెస్టు  చేశారు. బెదిరిస్తోంది అనుకున్నాడో లేక నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని ఉరివేసుకున్నదో తెలియదు కానీ కళ్లెదుటే భార్య ప్రాణాలు తీసుకుంటున్నా పట్టించుకోలేదు. 
పైగా ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు పెంచలయ్య. 

ఆమె ఉరి వేసుకుంటున్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  పెంచలయ్యను అరెస్టు చేశారు. మృతురాలిని ఆత్మకూరు మెప్మా లో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న కొండమ్మగా గుర్తించారు. అటు పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మెప్మా సిబ్బంది ఆందోళనకు దిగారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్