ఐఏఎస్‌లను అలా పంపితే మా పరిస్ధితేంటీ .. సర్వీస్ నిబంధనలపై ప్రధాని మోడీకి జగన్ లేఖ

By Siva KodatiFirst Published Jan 28, 2022, 9:17 PM IST
Highlights

కేంద్రానికి (govt of india) డిప్యూటేషన్‌పై (ias deputation) పంపించే ఐఏఎస్ అధికారుల ఎంపిక విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం వుండాలన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) . ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) లేఖ రాశారు. 

కేంద్రానికి (govt of india) డిప్యూటేషన్‌పై (ias deputation) పంపించే ఐఏఎస్ అధికారుల ఎంపిక విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం వుండాలన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) . ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) లేఖ రాశారు. ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో (ias service rules) సవరణలు ప్రతిపాదించింది కేంద్రం. ఇందుకు రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కోరింది. 

రాష్ట్రాల నుంచి కేంద్రానికి డిప్యూటేషన్‌పై పంపించే ఐఏఎస్ అధికారుల అంశంలో సవరణలు తీసుకొస్తున్న కేంద్రం చొరవను అభినందించారు జగన్. అయితే రాష్ట్రాలు నిరభ్యంతర పత్రాలు విడుదల చేసిన తర్వాతే డిప్యూటేషన్ ఖరారు అవుతున్న ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని కేంద్రానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. డిప్యూటేషన్‌పై వచ్చే ఐఏఎస్ అధికారి రిపోర్ట్ చేసే గడువును నిర్ణయించే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ తీసుకున్న తాజా సవరణపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్. ఉన్నపళంగా కీలక బాధ్యతల్లో వుండే అధికారులు వెళ్లిపోతే పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు సీఎం వైఎస్ జగన్. అధికారుల పనితీరు, సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికే తెలుస్తుంది కాబట్టి ఆ నిర్ణయం రాష్ట్రాలకే వదిలేస్తే బాగుంటుందని లేఖలో పేర్కొన్నారు. 

click me!