24 గంటల్లో 1167 మందికి పాజిటివ్.. తూ.గోలో అత్యధికం, ఏపీలో 20,45,657కి చేరిన కేసుల సంఖ్య

By Siva Kodati  |  First Published Sep 25, 2021, 5:35 PM IST

ఏపీలో కొత్తగా 1,167 కరోనా కేసులు నమోదవ్వగా.. 7 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,487 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,208 మంది చికిత్స పొందుతున్నారు


ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,167 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,45,657కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 7 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,125కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణ 2, ప్రకాశం 2, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,487 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,15,429కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 55,307మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,80,36,099కి చేరుకుంది.
ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,208 మంది చికిత్స పొందుతున్నారు. 

Latest Videos

నిన్న ఒక్కరోజు అనంతపురం 11, చిత్తూరు 167, తూర్పుగోదావరి 224, గుంటూరు 110, కడప 91, కృష్ణ 113, కర్నూలు 9, నెల్లూరు 141, ప్రకాశం 130, శ్రీకాకుళం 12, విశాఖపట్నం 37, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 121 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

COVID19 | Andhra Pradesh reports 1,167 fresh infections, 7 deaths in the past 24 hours; Active cases 13,208 pic.twitter.com/sH3B23Qqje

— ANI (@ANI)
click me!