ఏపీలో అనూహ్యంగా పెరిగిన కేసులు: కొత్తగా 1,145 మందికి పాజిటివ్.. చిత్తూరు, తూ.గోలలో తీవ్రత

Siva Kodati |  
Published : Sep 15, 2021, 05:52 PM IST
ఏపీలో అనూహ్యంగా పెరిగిన కేసులు: కొత్తగా 1,145 మందికి పాజిటివ్.. చిత్తూరు, తూ.గోలలో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు నమోదవ్వగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,243 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,603 మంది చికిత్స పొందుతున్నారు  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,30,524కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,030కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణ 3, ప్రకాశం 3, పశ్చిమ గోదావరి 2, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,243 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,01,891కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 62,252 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,74,75,461కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,603 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 28, చిత్తూరు 201, తూర్పుగోదావరి 274, గుంటూరు 141, కడప 131, కృష్ణ 164, కర్నూలు 11, నెల్లూరు 130, ప్రకాశం 136, శ్రీకాకుళం 14, విశాఖపట్నం 69, విజయనగరం 15, పశ్చిమ గోదావరిలలో 131 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?