గవర్నమెంట్ టీచర్లతో పోటీకి సిద్ధమా: శ్రీచైతన్య, నారాయణ కాలేజీల ఫ్యాకల్టీకి స్పీకర్ తమ్మినేని సవాల్

By Siva KodatiFirst Published Sep 15, 2021, 4:03 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు స్పీకర్ సవాల్ విసిరారు. కింతలిలోని జెడ్పీ హైస్కూల్‌లో టీచర్లతో పోటీకి రావాలంటూ తమ్మినేని ఛాలెంజ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు స్పీకర్ సవాల్ విసిరారు. కింతలిలోని జెడ్పీ హైస్కూల్‌లో టీచర్లతో పోటీకి రావాలంటూ తమ్మినేని ఛాలెంజ్ చేశారు. విద్యార్ధుల తల్లిదండ్రులు శ్రీచైతన్య, నారాయణ అంటూ ఎందుకు పరుగులు తీస్తున్నారని స్పీకర్ ప్రశ్నించారు. ఆ సంస్థల్లో పనిచేస్తున్న వారెవరికీ పూర్తి స్థాయి క్వాలిఫికేషన్ లేదని మండిపడ్డారు. అక్కడంతా ఏబీసీడీఎఫ్ అని బట్టి పట్టించడమే తెలుసునని స్పీకర్ వ్యాఖ్యానించారు. పిల్లల మెదడును మేనిప్యూలేట్ చేస్తున్నారంటూ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మంచి ట్రైనింగ్ కలిగిన వారని స్పీకర్ ప్రశంసించారు. 
 

click me!