అక్బర్ పాషా ఘటన.. వైసీపీ ప్రభుత్వంలో రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోంది: చంద్రబాబు

Siva Kodati |  
Published : Sep 11, 2021, 03:50 PM ISTUpdated : Sep 11, 2021, 03:55 PM IST
అక్బర్ పాషా ఘటన.. వైసీపీ ప్రభుత్వంలో రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోంది: చంద్రబాబు

సారాంశం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం  వ్యక్తం చేశారు. కడప జిల్లా మైదుకూరులో ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని ఆగ్రహం  వ్యక్తం చేశారు. మైదుకూరులో ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందని ఆయన అన్నారు. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయిందని చంద్రబాబు ఆరోపించారు.

ఇక్కడ కూడా తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సీఐ ఒకరు... అక్బర్ ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారని టీడీపీ అధినేత అన్నారు. అంతేకాకుండా ఎన్ కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం ఇంకా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి ఇంకెవరు దిక్కు? అని ప్రశ్నించారు.

ALso Read:అక్బర్ పాషా కుటుంబాన్ని కాపాడిన కడప పోలీసులు..

గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని... ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా తమకు అదే దిక్కంటోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలంటూ అక్బర్ కు ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్బర్ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. సంక్రాంతి వేళ ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
Pawan Kalyan Emotional Speech: కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది | Kondagattu | Asianet News Telugu