గణేష్ నిమజ్జనం ఊరేగింపులో అపశృతి.. కరెంట్ షాక్ తో 11 ఏళ్ల బాలుడు మృతి

Published : Sep 26, 2023, 08:57 AM IST
 గణేష్ నిమజ్జనం ఊరేగింపులో అపశృతి.. కరెంట్ షాక్ తో 11 ఏళ్ల బాలుడు మృతి

సారాంశం

వినాయక నిమజ్జనం ఊరేగింపులో అపశృతి జరిగింది. కరెంట్ షాక్ తో 11 సంవత్సరాల బాలుడు మరణించాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట లో సోమవారం చోటు చేసుకుంది.

ఏపీలోని పల్నాడు జిల్లాలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం చూసేందుకు వచ్చిన 11 ఏళ్ల బాలుడు కరెంట్ షాక్ తో మరణించాడు. ఈ ఘటన నరసరావుపేట లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట లోని మున్సిపల్ హైస్కూల్ లో 11 గణేష్ 6వ తరగతి చదువుతున్నాడు. అయితే సోమవారం స్థానికంగా పలు వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించారు.

ఒకరిని కాపాడబోయి మరొకరు.. చెరువులో మునిగి ముగ్గురు మహిళల మృతి, మరో బాలుడు గల్లంతు.. మెదక్ లో విషాదం..

ఈ ఊరేగింపును చూసేందుకు కోట సెంటర్ వంగవీటి  మోహన రంగా విగ్రహం వద్దకు గణేస్ వచ్చాడు. అయితే అక్కడున్న కరెంట్ వైర్లు తగలడంతో బాలుడికి ఒక్క సారిగా షాక్ కొట్టింది. బాలుడిని గమనించి స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. తరువాత బాలుడిని వెంటనే దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడికి చేరుకునేలోపే గణేష్ మరణించాడు.

మద్యానికి బానిసై , బాధ్యతలు గాలికొదిలేసిన కుమారుడు.. సుపారీ ఇచ్చి, హతమార్చిన తల్లిదండ్రులు

ఈ విషయం తెలుసుకున్న బాలుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు చేరుకున్నారు. బాలుడిని తలుచుకుంటూ వారంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇది అక్కడున్న కంటతడి పెట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?