కృష్ణా జలాలు: అప్పుడు కేసీఆరే ఒప్పుకున్నారు.. డాక్యుమెంట్లు బయటకు తీస్తున్న ఏపీ

By Siva KodatiFirst Published Aug 26, 2020, 6:45 PM IST
Highlights

కృష్ణా జలాల విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని ఇరిగేషన్ శాఖకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ విషయంలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ వివక్షతతో వ్యవహరిస్తోందని తమ అభ్యర్థనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ సర్కార్ భావిస్తోంది

కృష్ణా జలాల విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని ఇరిగేషన్ శాఖకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ విషయంలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ వివక్షతతో వ్యవహరిస్తోందని తమ అభ్యర్థనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ సర్కార్ భావిస్తోంది.

తెలంగాణ అభ్యంతరాలను మాత్రం గొరంతలుగా చేసి చూపుతోందని ఏపీ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని కిందకు తరలిస్తుండటంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు త్రాగునీరు సరఫరా చేయలేమని చెప్పినా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్‌సీ లేఖ రాశారు.

విద్యుత్ ఉత్పత్తిని నిలుపుల చేసేలా తెలంగాణ సర్కార్‌కు సూచించాలని కోరినా కూడా స్పందించలేదని లేఖలో ఈఎన్‌సీ స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా అదనంగా 0.517 టీఎంసీలు వాడుకుంటే తప్పుబట్టడం సరికాదని ఏపీ ప్రభుత్వం మండిపడింది.

శ్రీశైలంలో ప్రవాహం పెరిగినందున 66 టీఎంసీలను పోతిరెడ్డిపాడుకి కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. 2015లో కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ అంగీకరించిందనే ఆధారాలను ఇరిగేషన్ శాఖ సిద్ధం చేసింది.

సీమ ప్రాజెక్ట్‌లపై తెలంగాణకు కౌంటర్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. గతంలో తెలంగాణ సర్కార్ ఒప్పుకున్న అంశాలపై ఆధారాలు సిద్ధం చేస్తున్నారు.

అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు మినిట్స్ ఉన్నాయని ఏపీ వాదిస్తోంది. న్యాయస్థానాల్లోనూ, అపెక్స్ కౌన్సిల్‌లోనూ డాక్యుమెంట్లు సమర్పించేందుకు ఏపీ సర్కార్ సిద్ధపడుతోంది. 

click me!