కొత్తగా 10,820 కేసులు, 97 మంది మృతి: ఏపీలో 2 వేలు దాటిన కరోనా మరణాలు

By Siva Kodati  |  First Published Aug 9, 2020, 7:42 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,820 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 27 వేల 860కి చేరుకున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,820 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 27 వేల 860కి చేరుకున్నాయి.

ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 97 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,036కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,112 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లక్షా 38 వేల 712 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 24 లక్షల 87 వేల 305కి చేరింది.

Latest Videos

undefined

ఇవాళ అత్యథికంగా గుంటూరు జిల్లాలో 12 మంది మరణించగా, ఆ తర్వాత ప్రకాశం 11, చిత్తూరు 10, పశ్చిమ గోదావరి 10, అనంతపురం 8, కడప 8, శ్రీకాకుళం 8, కర్నూలు 7, తూర్పుగోదావరి 6, విశాఖ 6, కృష్ణా 4, నెల్లూరు 4, విజయనగరంలలో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1543 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత అనంతపురం 858, చిత్తూరు 848, గుంటూరు 881, కడప 823, కృష్ణా 439, కర్నూలు 1,399, నెల్లూరు 696, ప్రకాశం 430, శ్రీకాకుళం 452, విశాఖపట్నం 961, విజయనగరం 358, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,132 చొప్పున కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9,097 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 

click me!