విశాఖ పోర్టుట్రస్టులో ఆగిఉన్న నౌకలో అగ్ని ప్రమాదం

By narsimha lodeFirst Published Aug 9, 2020, 5:12 PM IST
Highlights

: విశాఖ పోర్టు ట్రస్టులోని ఆగి ఉన్న  నౌకలో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

విశాఖపట్టణం: విశాఖ పోర్టు ట్రస్టులోని ఆగి ఉన్న  నౌకలో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.పనామా బీడీ 51 నౌక కేబిన్ నుండి పొగలు చెలరేగాయి. వెస్ట్ క్యూ 5 బెర్త్ లో ఆగి ఉన్న చెన్నె షిప్ లో చెలరేగిలో మంటలు చెలరేగినట్టుగా పోర్టు అధికారులు తెలిపారు.

షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమని పోర్టు అధికారులు భావిస్తున్నారు. ఇంజన్ లో మంటలను ఆదుపు చేస్తున్నారు.అగ్ని ప్రమాదం ఇంజన్ రూమ్ లో కావడంతో గ్యాస్ మాస్కు ధరించి మంటలను అదుపు చేస్తున్నారు అధికారులు.

విశాఖ పట్టణంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంపై  స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 

విశాఖపట్టణంలోని పలు పరిశ్రమల్లో ప్రమాదాలు  చోటు చేసుకొన్నాయి. ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగాయి. గత వారంలో షిప్ యార్డులో భారీ క్రేన్ కూలిపోయింది. ఆ తర్వాత పోర్టుట్రస్టులో ఇవాళ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

click me!