ఏపీలో కరోనా విలయతాండవం: 10 వేలు దాటిన కేసులు.. చిత్తూరు, సిక్కోలులో బీభత్సం

By Siva KodatiFirst Published Apr 22, 2021, 6:33 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చూపిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. సెకండ్ వేవ్ వెలుగులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కేసుల సంఖ్య 10 వేలను దాటింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చూపిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. సెకండ్ వేవ్ వెలుగులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కేసుల సంఖ్య 10 వేలను దాటింది.

దీంతో ఏపీలో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇప్పటికే కరోనా కట్టడికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,759 మంది కోవిడ్ బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 9,97,462కి చేరుకుంది. కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ బారినపడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,541కి చేరుకుంది.

గత 24 గంటల్లో చిత్తూరులో 5, కృష్ణ 5, కర్నూలు 3, నెల్లూరు 3, ప్రకాశం 3, శ్రీకాకుళం 3, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, విజయనగరం 2, అనంతపురం, వైఎస్ఆర్ కడప, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 3,992 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 9,22,977కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 66,944కి చేరుకున్నాయి.  నిన్న ఒక్కరోజు 41,871 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య1,58,35,169కి చేరింది.

గత 24 గంటల వ్యవధిలో అనంతపురం 789, చిత్తూరు 1,474, తూర్పుగోదావరి 992, గుంటూరు 1186, కడప 279, కృష్ణ 679, కర్నూలు 1,367, నెల్లూరు 816, ప్రకాశం 345, శ్రీకాకుళం 1,336, విశాఖపట్నం 844, విజయనగరం 562, పశ్చిమ గోదావరిలలో 90 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

 

: 22/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,94,567 పాజిటివ్ కేసు లకు గాను
*9,20,082 మంది డిశ్చార్జ్ కాగా
*7,541 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 66,944 pic.twitter.com/3ePPd9zTBE

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!