కొత్తగా 106 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,90,080కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Mar 02, 2021, 07:15 PM IST
కొత్తగా 106 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,90,080కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య నిలకడగా వుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 106 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య నిలకడగా వుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 106 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,90,080కి చేరింది. నిన్న కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎటువంటి మరణం సంభవించలేదు. ఇప్పటి వరకు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,169గా వుంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 774 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 57 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్‌ల సంఖ్య 8,82,137కి చేరుకుంది.

నిన్న రాష్ట్రంలో 35,804 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేయడంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టుల సంఖ్య 1,40,10,204కి చేరింది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 10, చిత్తూరు 33, తూర్పు గోదావరి 11, గుంటూరు 7, కడప  5, కృష్ణ 9, కర్నూలు 3, నెల్లూరు 3, ప్రకాశం 0, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 8, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 8 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే... ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్